/rtv/media/media_files/2025/01/12/6isxb6TEvDuBMKre4FZc.jpg)
India Woman cricketer Sayali Satghare
Who is Sayali Satghare: అరంగేట్రం మ్యాచ్ లోనే ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది యువ క్రికెటర్ సయాలీ సత్‌ఘరే. జనవరి 10న రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సయాలీ.. సీమ్ బౌలింగ్‌తో చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సయాలీ 2 ఓవర్లు మెయిడిన్ చేయడంతోపాటు 1 వికెట్ పడగొట్టింది. అయితే సయాలీ బౌలింగ్ శైలి అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 130 కి. మీటర్ల వరకు వేగంగా బంతులేయడంతో సెలక్టర్లు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఎవరు ఈ సయాలీ అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు క్రికెట్ లవర్స్.
ముంబైకి చెందిన ఆల్‌రౌండర్ సయాలీ సత్‌ఘరే గణేష్ భారత్ తరపున మొదటి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మతి మంధాన చేతుల మీదగా ఇండియా క్యాప్ అందుకుంది. 24 ఏళ్ల సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్ తొలి మ్యాచ్ లోనే అత్యుత్తమ ప్రదర్శనతో తన స్థానాన్ని జట్టులో పదిలపరుచుకుంది. రేణుకా సింగ్ విశ్రాంతితో ఆమెను జట్టులోకి తీసుకోగా.. ఆకట్టుకునే నైపుణ్యాలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) సమయంలో గుజరాత్ జెయింట్స్ ఆమె ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
దేశీయ క్రికెట్‌లో రికార్డ్స్..
దేశీయ క్రికెట్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. 2023-24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ 51 లిస్ట్-A గేమ్‌లలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్-విన్నింగ్ సెంచరీతో సహా ఆమె 20.81 సగటుతో 666 పరుగులు చేసింది. బౌలింగ్ లోనూ 20.60 సగటుతో 56 వికెట్లు పడగొట్టింది. ఇప్పటి వరకు 49 T20 మ్యాచ్‌లలో 37 వికెట్లు తీసింది. అత్యత్తమం 5/13. ఆమె ముంబై క్రికెట్ జట్టుకు కీలక ప్లేయర్ గా నిలిచింది.
𝗥𝗲𝘀𝗶𝗹𝗶𝗲𝗻𝗰𝗲 | 𝗥𝗲𝗰𝗼𝗴𝗻𝗶𝘁𝗶𝗼𝗻 | 𝗥𝗲𝘄𝗮𝗿𝗱 🙌
— BCCI Women (@BCCIWomen) January 10, 2025
Saima Thakor narrates best friend Sayali Satghare's journey ❤️
Recap that memorable 🧢 moment in presence of the Debutant's family 🤗#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/905TOQK21r
ఇది కూడా చదవండి: Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?
2025 ODI ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఆల్-రౌండర్ బృందాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలోనే సత్‌ఘరే చేరిక జట్టుకు బలాన్నిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆమె ద్వంద్వ సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయిని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. ఐర్లాండ్‌పై ఆమె అరంగేట్రం భారత్‌కు కొత్త ఆరంభాన్ని సూచిస్తుందని, భవిష్యత్ దృష్ట్యా మరింత కీలకమైన ప్లేయర్ గా మారుతుందంటున్నారు. ప్రపంచ క్రికెట్ లో గొప్ప క్రికెటర్ గా నిలుస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!