TG Crime : రూ.70లక్షలు లంచం తీసుకుంటూ..సీబీఐకి చిక్కిన మాజీ ఎమ్మెల్యే కొడుకు

వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్ 70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. జీవన్ లాల్ ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. జీవన్ లాల్ తో పాటు మరికొంతమందిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

New Update

TG Crime : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో సంతృప్తి చెందాల్సిన ఒక ఇన్‌కం టాక్స్‌ అధికారి లక్షల్లో లంచం తీసుకంటూ అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా ఒకటి రెండు లక్షలు కాదు ఏకంగా రూ.70 లక్షలు కావడం గమనార్హం. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ కు చెందిన జీవన్‌ లాల్‌ హైదరాబాద్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్సెమ్షన్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారవేత్త నుండి, అతని సంస్థకు సంబంధించిన పన్ను సంబంధిత సమస్యలను సెటిల్ చేయడానికి లంచం డిమాండ్‌ చేశాడు. అది కూడా ఏకంగా 70 లక్షల రూపాయలు తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు.

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

జీవన్‌ లాల్‌ లంచం తీసుకుంటున్న విషయం సీబీఐ దృష్టికి రావడంతో వారు నిఘా పెట్టారు. సమయం కోసం వేచి చూస్తుండగా రూ.70 లక్షలు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనతో పాటు శ్రీకాకుళానికి చెందిన శ్రీరామ్‌‌‌‌ పలిశెట్టి, విశాఖపట్నానికి చెందిన నట్ట వీర నాగ శ్రీరామ్‌‌‌‌గోపాల్‌‌‌‌, ముంబైకి చెందిన షాపూర్‌‌‌‌జీ పల్లోంజికి, విరల్‌‌‌‌ కాంతిలాల్‌‌‌‌ మెహతా, సాజిద మజ్హర్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ షాల తదితరులను  కూడా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితులకు సంబంధించిన ఢిల్లీ, హైదరాబాద్, ఖమ్మం, ముంబై, విశాఖపట్నం లోని 18 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది, ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, డాక్యమెంట్లు టాక్స్‌ అప్పీళ్లకు చెందిన పలు విలువైన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారని సీబీఐ తెలిపింది.    జీవన్ లాల్‌ను కోర్టులో హాజరుపరిచి, సీబీఐ కస్టడీకి తీసుకున్నారు. జీవన్ లాల్ భార్య ఐపీఎస్ అధికారి.

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

కాగా సీబీఐకి చిక్కిన జీవన్‌ లాల్‌ ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌ కొడుకు కావడం విశేషం. రాములు నాయక్, తెలంగాణలోని వైరా నియోజకవర్గం నుండి 2018లో  కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లోను ఆయనకు టిక్కెట్ రాలేదు 

సీబీఐ అరెస్టు చేసి అతని ఇంటిలో, కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. లంచం డబ్బుతో పాటు కొన్ని ఆస్తుల సంబంధిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. జీవన్ లాల్‌ను కోర్టులో హాజరుపరిచి, సీబీఐ కస్టడీకి తీసుకున్నారు. జీవన్ లాల్ భార్య శిప్రా శ్రీవాస్తవ్‌ ఐపీఎస్ అధికారి.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు