/rtv/media/media_files/2025/09/25/hyderabad-metro-2025-09-25-20-16-34.jpg)
Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొదటి దశ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ కొనుగోలు చేయనుంది. ఎల్ అండ్ టీకి ఉన్న రూ.13 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎల్ అండ్ టీకి రూ.2100 కోట్ల నగదు చెల్లించనున్నట్లు సమాచారం.ఇదిలాఉండగా హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సంస్థ నిర్మించింది. అయితే తాజాగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.