Ap Rains: ఏపీపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో ఒకటి, రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. By Bhavana 03 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Rains: ఏపీ పై ఫెంగల్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. మంగళవారం శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి,శ్రీ సత్య సాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. Also Read: GOOD NEWS: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. Also Read: Cyber Crime: అలా 1 నొక్కాడు..ఇలా లక్ష పొగొట్టుకున్నాడు! మరోవైపు ఫెంగల్ తుఫాన్ కారణంగా రైతులు పంట నష్టపోయారు. అయితే తుఫాన్, వర్షాల కారణంగా పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రి తుఫాన్ ప్రభావంపై అధికారులతో సమీక్ష చేశారు. అంతేకాదు వర్షం కారణంగా తడిసిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని చెప్పారు. మరో ఒకటి, రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. మొత్తం 53 మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉందని.. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. Also Read: Punjab:మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా! ఏపీలోని ఫెంగల్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. Also Read: Chennai: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి తిరుపతి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది సహా నాయుడుపేట,పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో వర్షాల ధాటికి కొండచరియలు జారిపడుతున్నాయని.. భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని చెప్పారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి