Mulugu: మంగపేటలో మహిళా ఆరోగ్య క్లీనిక్‌కు ప్రారంభోత్సవం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య క్లీనిక్‌కు ప్రారంభోత్సవం చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా వైద్య సేవలు పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట పీహెచ్సీలో మహిళా ఆరోగ్య క్లీనిక్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.