టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్‌‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.' అతను చాలా క్యూట్ గా ఉంటాడు. నేను సింగిల్ గానే ఉన్నాను. అతనితో డేటింగ్ కు నేను రెడీ. మీరేం అనుకుంటారో అనుకోండి ఇది జరిగేలా చూడండి..' అని చెప్పింది.

New Update
gill

సినిమా హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయణం నడపడం కొత్తేమి కాదు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు క్రికెటర్స్ తో సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేశారు. వాళ్లలో కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఈ మధ్య క్రికెటర్స్ తో రిలేషన్ మైంటైన్ చేస్తున్న వారిలో మన టాలీవుడ్ హీరోయిన్లు కూడా చేరిపోతున్నారు. 

ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్.. ఇండియా క్రికెటర్ బుమ్రాతో సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతుందని వార్తలు వచ్చాయి.  తాజాగా 'అఖండ' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్‌‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  ప్రగ్యా జైస్వాల్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగింది. 

 Also Read : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చాలా క్యూట్ గా ఉంటాడు..

అందులో రిలేషన్ షిప్ స్టేటస్ తో పాటూ పలువురు సెలెబ్రిటీల పేర్లు చెప్పింది. వారిలో క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్‌‌ పేరు చెప్పడంతో..' అతను చాలా క్యూట్ గా ఉంటాడు. నేను సింగిల్ గానే ఉన్నాను. మీరేం అనుకుంటారో అనుకోండి ఇది జరిగేలా చూడండి. అది రాసి ఉంటే జరుగుతుంది. 

అతను క్రికెటరా కాదా? అని నేను చూడను. మంచి అబ్బాయి అయితే ఎవరు కాదంటారు...' అని చెప్పింది. దీంతో ప్రగ్యా జైస్వాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా శుబ్ మన్ గిల్ ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం ఎంత అనేది తెలీదు. మొత్తంగా శుబ్ మన్ గిల్ కు హీరోయిన్స్ లో మాంచి క్రేజే ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు