/rtv/media/media_files/2025/11/01/food-poisoning-in-gadwal-bc-hostel-2025-11-01-07-33-21.jpg)
Food poisoning in Gadwal BC Hostel
Food Poison: గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ బాలుర హాస్టల్ లోని విద్యార్థులు.. సాయంత్రం భోజనం చేశాక రాత్రి భోజనం వికటించి వాంతులు చేసుకున్నారు. మరికొందరు కడుపునొప్ని విరోచనాలతో బాధపడ్డారు. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే స్పందించి, బాధిత విద్యార్థులను మూడు 108 అంబులెన్స్ వాహనాలు, కొన్ని ప్రైవేటు వాహనాల సహాయంతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు తక్షణమే చికిత్స అందించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశామని డాక్టర్లు తెలిపారు. అక్కడ విద్యార్థులను పరీక్షించిన వైద్యులు వెంటనే వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అందరూ సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.మొత్తం 110 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటుండగా, వారిలో 50 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు స్పష్టం చేశారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థులకు సముచిత వైద్యం అందిస్తున్నారు.
ప్రభుత్వ హాస్టల్స్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వీటిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. హస్టల్ సిబ్బందితో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!
Follow Us