Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

New Update
Fire accident

Fire accident

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కంపెనీలో  మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు సంభవించడం గమనార్హం. ఇటీవలే అబిడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ తర్వాత మాదాపూర్‌లోని సత్వ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మాదాపూర్‌లోని ఖానామెట్‌లో సైతం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. 

Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!

శుక్రవారం జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో కూడా ఊహించని ప్రమాదం జరిగింది. రిషిక కెమికల్‌ గోడౌన్‌లో మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Also Read: తెలంగాణలో మరో ఘోరం.. గర్ల్స్ టాయిలెట్స్‌లో మొబైల్ కెమెరాతో వీడియో!

Also Read: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు