/rtv/media/media_files/2025/03/27/L17322GZL1DWF4Oo8Dkt.jpg)
Fire Accident
నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 ఎకరాల్లో వృక్ష సంపద కార్చిచ్చు వల్ల కాలిపోయింది. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలు మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై స్పష్టతం లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS) కోల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కోల్‌ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు దగ్గర మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. NTTPS అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. వారి నిర్లక్ష్యం కారణంగా స్టేజ్-1 బంకర్‌కి వెళ్లే కన్వేయర్ బెల్ట్.. 40 మీటర్ల మేర మంటలతో దగ్ధమయ్యాయి.
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
ఇక ఈ నెల మొదటివారంలో హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా కట్టిన అంబర్‌పేట్ కొత్త ఫ్లై ఓవర్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫైఓవర్ కింద గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి గోడౌన్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
fire-accident | telugu-news | rtv-news | telangana