హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 3 ఏళ్ల కొడుకును తండ్రి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే బండ్లగూడలోని నూరినగర్‌లో మహ్మద్ అక్బర్(35), సనాబేగం దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఇద్దరు కుమారులు. అయితే గత కొంతకాలంగా చిన్నకొడుకు అనాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కొడుకు అనారోగ్యంపై భార్తభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతుండేవి. భార్య శనివారం నైట్ డ్యూటీకి వెళ్లింది. దీంతో తెల్లవారుజామున తండ్రి అక్బర్ కొడుకు హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
Also Read: చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్ ఫైట్
ఈ క్రమంలోనే పిల్లాడి తలపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో అయాన్ మృతి చెందాడు. ఆ తర్వాత సంచిలో మృతదేహాన్ని కుక్కి, బైక్‌పై తీసుకెళ్లాడు. నయాపూల్ బ్రిడ్జి మీది నుంచి మూసీలో విసిరేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన చిన్న కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. బంధువులపై నింద మోపి తప్పించుకోవాలని యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అక్బర్ దొరికిపోయాడు.