/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t075241564-2025-11-03-07-54-45.jpg)
Fatal accident in Chevella
Crime: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 18మంది అక్కడికక్కడే మృతి చెందారు పలువురుతీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు.ప్రమాదం సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. /filters:format(webp)/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t075258160-2025-11-03-07-55-18.jpg)
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ స్పీడ్ ను అదుపు చేయలేకపోవడంతో కంకర లోడుతో సహ బస్సుపై పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్, బస్సు డ్రైవర్‌తో పాటు మొత్తం 18 మంది మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ మృతదేహం లారీలోనే ఇరుక్కుపోయింది. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోనకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
— Sarita Avula (@SaritaAvula) November 3, 2025
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
బస్సును ఢీకొట్టిన లారీ, పలువురికి తీవ్ర గాయాలు
బస్సులో 70 మంది ప్రయాణికులు
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు.. pic.twitter.com/mYYyYGqB96
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పలువురు ప్రయాణీకులు కంకర కింద కూరుకుపోయారు. దీంతో జేసీబీతో కంకరను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Follow Us