Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా...వాటి వెనుక ఉన్నదెవరంటే?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా కొనసాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాదాల్లో ఉన్న భూములకు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిందీ మూఠా.

New Update
Fake passbook scam

Fake passbook scam

Khammam Scam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా కొనసాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాదాల్లో ఉన్న భూములు, గతంలో అమ్మగా మిగిలిన భూములు, రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన ఓ ముఠా రైతులను నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి కూసుమంచి మండలంలోని జక్కేపల్లి వాసితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, ఒక ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి  ఖమ్మం, భధ్రాధ్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట.. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతుల నుంచి కోట్ల రూపాయల వసూలు చేసినట్లు తేలింది.

ఉన్నతాధికారులతో మంచి పరిచయాలున్నాయని...చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు నుంచి.. పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ బాధిత రైతులను నమ్మించిన ముఠా ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున వసూలు చేసింది. సర్వే నెంబర్లతో సహా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి...--- రైతుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కలర్‌ ప్రింటర్‌తో ముద్రించిన నకిలీ పాసు పుస్తకం రైతులకు అంటగట్టారు.  దానిపై ఖాతా సంఖ్యలు, సర్వే నంబర్లతో పాటు ఫొటో ముద్రించి ఉండటంతో అసలుదేనని రైతులు నమ్మి డబ్బులు చెల్లించారు. ఇలా ఎకరాకు రూ.5 లక్షల చొప్పున మూడు, నాలుగేళ్లుగా ఈ ముఠా  రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర భూముల కంటే వీటి ధర తక్కువ చెప్పడం, దాంతోపాటు పాసు పుస్తకాలు ఇవ్వడంతో రైతులు కూడా నిజమేనని నమ్మి లక్షలాది రూపాయలు చెల్లించి పాస్​ పుస్తకాలు తీసుకున్నారు.

ఇదే క్రమంలో జక్కేపల్లికి చెందిన ఒక రైతుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పిస్తానని నమ్మబలికాడు. సీసీఎల్‌ఏ విభాగంలో పని చేస్తున్న వ్యక్తి తనకు తెలుసంటూ రూ.13.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు విడతల్లో రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఇలా చాలామంది నుంచి డబ్బులు వసూలు చేశారు. బయ్యారంలో కలర్ జిరాక్స్‌‌ మిషిన్లను పాల్వంచలో ప్రింటింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకుని నకిలీ పాస్ పుస్తకాలతో దందా చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది.వారు ఇచ్చిన పాసుపుస్తకాలు నిజమైనవేనని నమ్మిన రైతులు ఇటీవల భూభారతి వెబ్‌సైట్‌లో వివరాలు వెతకటం ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో కనిపించకపోవటంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు.

నాగర్‌కర్నూల్‌కు చెందిన ఒక రైతు రూ.50 లక్షలు ఇచ్చాడు. ఇటీవల తనను ముఠా నాయకుడికి పరిచయం చేసిన మధ్యవర్తి ఇంటికొచ్చి డబ్బు తిరిగివ్వాలని గొడవకు చేశారు. ఘట్‌కేసర్‌కు చెందిన మరో వ్యక్తి రూ.46 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు జక్కేపల్లికి వచ్చి ఆరా తీస్తుండటంతో నకిలీ పాసుపుస్తకాల వ్యవహారం బట్టబయలైంది . ఇటీవల అంజిరెడ్డి  అనే రైతు పేరిట పట్టాదారు పాసుపుస్తకాలను వాట్సాప్‌లో పంపారు కేటుగాళ్లు.భూభారతి వెబ్‌సైట్‌లో భూమి వివరాలను  రైతు అంజిరెడ్డి క్రాస్ చేశాడు. కానీ,వెబ్‌సైట్‌లో ఎలాంటి వివరాలు చూపించకపోవడంతో పాసు పుస్తకాలు నకిలీవని గుర్తించారు. ఈ విషయాన్నిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచారణకు ఆదేశించారు.అంజిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి కూసుమంచి పోలీసులు నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో కాంగ్రెస్ నేత కొత్త జీవన్ రెడ్డి కీరోల్ పోషించాడని గుర్తించారు. దీంతో ఖమ్మం గ్రామీణ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు దర్యాప్తు ముమ్మరం చేశారు. జక్కేపల్లి వాసితో పాటు బయ్యారం, పాల్వంచ, సారపాకకు చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కలర్‌ ప్రింటర్‌ను స్వాధీన పరచుకున్నట్లు సమాచారం.

Also Read: Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది

Advertisment
తాజా కథనాలు