Telangana: ఏండ్లు గడిచినా.. ఆ భూములకు పత్తాలేని పాస్ బుక్ లు!
ధరణి పోర్టల్ వచ్చి మూడేళ్లు దాటినా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాపు 18 లక్షల ఎకరాలకు పట్టాదార్ పాస్ బుక్ లు ఇంకా ఇవ్వలేదని భూ యజమానులు వాపోతున్నారు. దీనివల్ల భూమి అమ్మకం, కొనుగోలు పెద్ద సమస్యగా మారిందని, భారీగా నష్టపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.