Telangana: షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను రియాజ్‌ చంపినట్లు ఆధారాలు లేవు

ఇటీవల నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను చంపిన రియాజ్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాక్ట్‌ ఫైండింగ్ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది.

New Update
Fact finding commitee responds on Riyaz encounter

Fact finding commitee responds on Riyaz encounter


ఇటీవల నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను చంపిన రియాజ్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాక్ట్‌ ఫైండింగ్ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది.  ప్రమోద్ హత్య వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. '' కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ చంపడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

బైక్‌పై కానిస్టేబుల్ ప్రమోద్, అతని బంధువు మధ్యలో కూర్చున్న రియాజ్‌ వాళ్లిద్దరి మీద కత్తితో దాడి చేసినట్లు నమ్మశక్యంగా లేదు. రియాజ్ ఒక బైక్ రికవరీ ఏజెంట్. రియాజ్ రికవరీ చేసిన ఒక బైక్ లో అతడికి రూ.3 లక్షలు దొరికాయి. వాటితో ఒక బర్గ్ మన్ స్కూటీ కొనుక్కొని..మిగతా డబ్బులను అతడు ఖర్చు చేశాడు. అయితే ఆ డబ్బు ఎవరిదైతే ఉందో వాళ్లు ఆ డబ్బు కోసం రియాజ్‌ను ఒత్తిడికి గురి చేశారు. ఈ మొత్తం ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ జోక్యం కూడా ఉంది.

Also read: కోటి ఉద్యోగాలు ఇస్తాం.. బీహార్‌ ఎన్నికల కోసం ఎన్డీయే మ్యానిఫెస్టో!

 సంఘటన జరిగిన ప్రదేశంలో ఎవరో వచ్చి అక్కడ ప్రమోద్ డెడ్ బాడీని అక్కడ వదిలేసి వెళ్లారని విచారణలో తేలింది. కానీ పోలీసులు చెప్పినట్లు, వార్తల్లో వచ్చినట్లు రియాజ్ కత్తితో పొడిచి పారిపోయినట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలు లభించలేదు.హాస్పిటల్‌కు తీసుకురావడానికి ముందే అతడు మృతి చెందాడు. హాస్పిటల్‌కు తీసుకొచ్చినప్పుడు అతని బాడీలో మూడు బుల్లెట్లు దిగాయి. అతను బతికి ఉన్నట్లయితే నడుచుకుంటూ వచ్చే దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యేవి. చిన్నపిల్లలతో సహా రియాజ్ కుటుంబంపై పోలీసులు థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారని'' ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యుడు వివరించారు.

Also Read: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

మరోవైపు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై అతని కుటుంబ సభ్యులు HRCని ఆశ్రయించారు. అయితే ప్రమోద్‌తో రియాజ్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఓ కేసు విషయంలో ప్రమోద్‌ రూ.3 లక్షలు డిమాండ్ చేశాడని రియాజ్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు