/rtv/media/media_files/2025/10/31/sudhrashan-reddy-and-prem-sagar-rao-2025-10-31-14-11-50.jpg)
Sudhrashan reddy and prem sagar rao
తెలంగాణ ప్రభుత్వం సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఆయనకు అప్పగించారు. కేబినెట్ బెర్త్ కోసం సుదర్శన్ రెడ్డి పోటీపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బోధన్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రేమ్‌సాగర్ రావును నియమించారు. ప్రస్తుతం ఈయన మంచిర్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం యత్నించారు. కానీ రేవంత్ సర్కార్ వీళ్లకు ఇతర పదవులు అప్పగించింది. అయినప్పటికీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను కేబినెట్ ర్యాంక్‌గానే పరిగణనిస్తారు.
Also Read: కోటి ఉద్యోగాలు ఇస్తాం.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మ్యానిఫెస్టో!
మరోవైపు ఈరోజు తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం కేబినేట్‌లో ఇంకా రెండు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండూ కూడా ఓసీ, బీసీ నేతలకు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.
Also Read: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారు.. రాత్రంతా శవాల మధ్యే
Follow Us