/rtv/media/media_files/2025/10/18/extreme-tension-during-bc-bandh-2025-10-18-12-49-29.jpg)
Extreme tension during BC bandh
BIG BREAKING: బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ పాటించకుండా పలు షాపులు తెరవడంతో ఆగ్రహానికి గురైన బీసీ సంఘం నాయకులు షాపులపై రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్ – నల్లకుంట పరిధిలో తెరిచి ఉన్న బజాజ్ షో రూమ్ తో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. పలు చోట్ల బలవంతంగా దుకాణాలు మూయించారు. బంద్ నేపథ్యంలో కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోయాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నేతలు దాడి చేశారు. బంక్‌లోని బోర్డులు, కుర్చీలు ధ్వంసం చేయడంతోపాటు పెట్రోలు పోసే పంపులను విరగొట్టారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బీసీ బంద్‌లో తీవ్ర ఉద్రిక్తత
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2025
షాపులపై రాళ్ల దాడి చేసిన బీసీ సంఘం నాయకులు
హైదరాబాద్ – నల్లకుంట పరిధిలో బీసీ బంద్ నేపధ్యంలో తెరిచి ఉన్న బజాజ్ షో రూమ్ మరియు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పై రాళ్లు విసిరి బలవంతంగా మూయించిన బీసీ నాయకులు https://t.co/iyiNx5cvdhpic.twitter.com/uDT2uatxVd
కిందపడ్డ వీహెచ్
బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యానర్ చేతపట్టుకుని నాయకులు ర్యాలీ తీస్తుండగా బ్యానర్ కాళ్లకు తట్టుకుని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కింద పడిపోయారు. అక్కడే ఉన్న నాయకులు వెంటనే ఆయనను లేపారు. ఆయనకు స్వల్పగాయాలయ్యాయి.
బీసీ ర్యాలీలో కిందపడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంత రావు
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2025
ర్యాలీ చేస్తుండగా బ్యానర్ అడ్డు తగలడంతో ముందుకి పడిపోయిన హనుమంతరావు pic.twitter.com/HXegpV90GH
హంతకులే వచ్చి నివాళి అర్పిస్తున్నట్లు ఉంది!
కాగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. హంతకులే వచ్చి నివాళి అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాగా బీసీ బంద్ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అయితే ఇందులో కవిత కొడుకు ఆదిత్య పాల్గొన్నాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చాడు.
రాష్ట్ర బంద్‌లో భాగంగా గౌలిగూడా ఏంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2025
జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గెట్ వద్ద ఆందోళనకు దిగిన నాయకులు
ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు pic.twitter.com/4cyZ0VzvUh
బీసీ బంద్‌లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో చేపట్టిన నిరసనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో కలిసి రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా గౌలిగూడా ఏంజీబీఎస్ వద్ద తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు బైఠాయించారు. జేఏసీ వర్కింగ్ ఛైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గెట్ వద్ద నాయకులు ఆందోళనకు దిగారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.