Niranjan Reddy: టీడీపీ కోసం రేవంత్ బాధపడుతున్నాడు.. నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీపై కుట్రలు చేశామని రేవంత్ బాధపడుతున్నారని.. ఇక్కడ రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.

New Update
Niranjan Reddy

Niranjan Reddy

జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వెనుక సీఎం రేవంత్ ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పాలమూరు జిల్లాలో బుధవారం పర్యటించిన సీఎం రేవంత్ స్పందించారు. తనకు ఇందులో సంబంధం లేదని తేల్చిచెప్పారు. గతంలో టీడీపీపై కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో కనుమరుగవుతుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  

Also Read: అందుకేనా నాకు ఈ శిక్ష.. కవిత ఎమోషనల్ ట్వీట్!

సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి, సిగ్గు పడాల్సినవని అన్నారు. '' తెలంగాణలో టీడీపీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే కనుమరుగైంది. చంద్రబాబు నాయుడు రాహుల్‌ గాంధీతో రాజీ పడ్డారు. ఇప్పుడు టీడీపీ ఏపీకి పరిమితైపోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. రేవంత్ కాంగ్రెస్ సీఎంగా ఉండి కూడా టీడీపీ గురించి మాట్లాడుతున్నారు. టీడీపీపై కుట్రలు చేశామని రేవంత్ బాధపడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ పట్టించుకోవడం లేదు. 

Also read: కవితను పట్టించుకోని కేటీఆర్.. రాజీనామా తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే!

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 94 వేల కోట్లు ఖర్చయ్యాయి. మరీ లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది. కాళేశ్వరంపై కమిషన్ చేసింది లొట్టపీసు నివేదిక. ఆ కమిషన్ న్యాయ సూత్రాలు పాటించలేదు. అది లీగల్‌గా కూడా చెల్లదు. ఈ నివేదిక మీద మాట్లాడేందుకు అసెంబ్లీలో అందరికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే దేశంలో టాప్‌ జిల్లాలో పాలమూరుకు చోటు దక్కుతుంది. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్‌పై దాడి చేస్తున్నారు. రేవంత్‌కు దమ్ముంటే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు పర్మిషన్లు తీసుకురావాలి. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. 

Also Read: నాడు హరికృష్ణ నుంచి నేడు కవిత, షర్మిల వరకు.. కుటుంబ సభ్యులతో విభేదించిన నేతల లిస్ట్ ఇదే!

కొందరు ఎవరికోసమో కావాలనే హరీష్ రావును టార్గెట్ చేశారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే ఆయన ఉన్నారు. విరామం లేకుండా పనిచేశారు. ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోయిన విషయంలో అసలు ఆయనకు సంబంధమే లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలను హరీష్ రావు గెలిపించారంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఏ శాఖ ఇచ్చిన ఆయన సమర్థవంతంగా పనిచేశారు. కవితకు కష్టం వచ్చినప్పుడు అందరం బాధపడ్డాం. కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరికి లాభం జరుగుతాయి. సంతోష్‌ ఎక్కడా కూడా ప్రభుత్వంలో లేరు. ఓసారి రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేసీఆర్‌కు సహాయకుడిలా పనిచేస్తున్నారు. కేసీఆర్‌ను కాదని పార్టీలో ప్రధాన పాత్ర పోషించే పరిస్థితి ఎవరికీ లేదని'' నిరంజన్ రెడ్డి అన్నారు. 

Also Read:  కవిత డ్రామాలు అందుకే.. బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు