BIG BREAKING: అందుకేనా నాకు ఈ శిక్ష.. కవిత ఎమోషనల్ ట్వీట్!

నిజం మాట్లాడినందుకు ఇదే శిక్ష అయితే, తెలంగాణ ప్రజల కోసం ఈ మూల్యం వందసార్లు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేసిన కవిత సత్యమేవ జయతే.. జై తెలంగాణ.. అంటూ ముగించారు.

New Update
515005123_1277141763773242_4196130040136110214_n

నిజం మాట్లాడినందుకు ఇదే శిక్ష అయితే, తెలంగాణ ప్రజల కోసం ఈ మూల్యం వందసార్లు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేసిన కవిత సత్యమేవ జయతే.. జై తెలంగాణ.. అంటూ ముగించారు. హరీష్ రావుపై ఆరోపణల నేపథ్యంలో నిన్న కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేశారని ఆరోపించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని.. ట్రబుల్ క్రియేటర్ అని ధ్వజమెత్తారు. కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లను మేనేజ్ చేస్తే.. హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఓటమికి ఆయన కుట్ర చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 

నిజామాబాద్ లో తన ఓటమి కూడా ఆయనే కారణమన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డిని కలిసిన చరిత్ర ఆయనదన్నారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలన్నది ఆయన కుట్ర అని ఫైర్ అయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుపై సైతం కవిత నిప్పులు చెరిగారు. ఆయన దనదాహం అంతులేనిదన్నారు. ఈ కారణంగానే సిరిసిల్లలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారు ఎందుకు పనికి రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేయడానికి కేసీఆర్ పై వీరు ఒత్తిడి తెచ్చారని అనుకుంటున్నానన్నారు. ఆ కారణంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు.  ఇదిలా ఉంటే.. కవిత వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. పార్టీ ముఖ్య నేతలెవరూ ఆమె వ్యవహారంపై స్పందించడం లేదు. ఈ రోజు పినపాకకు చెందిన పలువురు కార్మిక సంఘం నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అయితే.. కవిత వ్యవహారంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరో నేత నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాత్రం కవిత వ్యవహారంపై స్పందించారు. కొంతమంది హరీష్ రావును టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కు రక్షణ వలయంలా ఉండాల్సిన పరిస్థితిలో విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కొందరు ఎవరికోసమో హరీష్ రావును టార్గెట్ చేశారని పరోక్షంగా కవితకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి హరీష్ రావు ఉన్నారన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి కథలో సిద్దయ్యాలా కేసీఆర్ కు హరీష్ రావు పనిచేశారన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని అన్నారు. హరీష్ రావును చూసి చాలా నేర్చుకోవాలన్నారు.

Advertisment
తాజా కథనాలు