Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నా కుటుంబం, కేసీఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరన్నారు.
Also Read : అబ్బా భలే ఉంది.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. అధికారంలో ఉన్నా, లేకపోయినా నేను కేసీఆర్‌తోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు. వీటిని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
కాగా గత బీఆర్‌ఎస్‌లో సంచలన నాయకుడిగా గుర్తింపు పొందిన యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో ముందుంటారని పేరుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసు వేయడమే కాకుండా దమ్ముంటే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడంలోనూ పలుమార్లు వివాదాలకు కారణమయ్యాడన్న ప్రచారం ఉంది. వివిధ ఆందోళనల్లోనూ ఆయన వ్యవహరించిన తీరుతో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయతే ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీన్ని ఆయన ఖండించారు.
Read More: https://rtvlive.com/international/pakistan-army-rescued-80-passengers-from-baloch-separatists-hijack-pak-train-8844843
Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే...పాడి కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్
నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని బీఆర్‌ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ..తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
Padi Kaushik Reddy