Mahindra University : మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం. విద్యార్థులకు టెస్ట్‌ చేయగా...

బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం రేపింది. డ్రగ్స్‌ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్‌ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా విద్యార్థులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నముఠాను నార్కోటిక్‌ బ్యూరో అదుపులోకి తీసుకుంది.

New Update
Drug scare at Mahindra University.

Drug scare at Mahindra University

Mahindra University : బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం రేపింది. డ్రగ్స్‌ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్‌ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠాను నార్కోటిక్‌ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను గుర్తించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిందితులనుంచి 1.15 కేజీల గంజాయి, 45గ్రాముల ఓజీ వీడ్‌తో పాటు ప్యాకింగ్‌ సామగ్రి, డిజిటల్‌ తూకం యంత్రం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం, జీడిమెట్ల, మహీంద్ర యూనివర్సిటీ వద్ద దాడులు నిర్వహించి విద్యార్థులు మహ్మద్‌ అషార్‌ జావీద్‌ఖాన్‌, నేవీల్‌ టాంగ్‌ బ్రామ్‌తో పాటు జీడిమెట్లకి చెందిన అంబటి గణేశ్‌, శివకుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా..  దాదాపు 50మంది డ్రగ్స్‌ కొనుగోలు దారుల లిస్ట్‌ లభించిందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ హాస్టల్‌ పరిసరాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: ఒక్క వెంట్రుకతో పాకిస్తాన్‌ని 15ఏళ్లు వెనక్కి నెట్టిన అజిత్ దోవల్.. అసలు ఏం జరిగిందంటే?

 యూనివర్సిటీలో చదివే మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థి ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్‌ ద్వారా ఓజీ కుష్‌ డ్రగ్‌ను తెప్పించుకుంటున్నట్టు తేలింది. దాన్ని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్‌కు విక్రయిస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో  పోలీసులు రైడ్‌ చేశారు.సదరు విద్యార్థితో పాటు మరో విద్యార్థిని,  ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో  కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఐదుగురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అరెస్ట్‌ అయిన మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వర్సిటీలో సోదాలు జరిపి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్

ఇటీవల అరెస్ట్‌ చేసిన మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మహీంద్రా యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు.   శ్రీమారుతి కొరియర్ సర్వీస్ ద్వారా ఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో విద్యార్థులు నిక్ అనే నైజీరియన్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి నగరంలోని పలు పబ్‌లలో పార్టీలు చేసుకున్నట్లు కూడా గుర్తించారు. డ్రగ్స్ బారిన పడిన 50 మంది విద్యార్థులకు పోలీసులు ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు