Tg news : తెలంగాణలో రాక్షసబల్లి అవశేషాలు..ఎన్నిలక్షల సంవత్సరాలదో తెలుసా ?

తెలంగాణలో గతంలోనే రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్లు బయట పడగా, తాజాగా మన రాష్ట్రానికి అంతకంటే పూర్వపు చరిత్ర ఉందని తేలింది. మరో ప్రాచీన యుగానికి తెలంగాణ నిలయమని సుమారు 26 లక్షల సంవత్సరాల కంటే ముందే తెలంగాణ మనుగడ సాగించిందని తేలింది.

New Update
Dinosaur

Dinosaur


Tg news : తెలంగాణలో గతంలోనే రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్లు బయట పడగా, తాజాగా మన రాష్ట్రానికి అంతకంటే పూర్వపు చరిత్ర ఉందని తేలింది. మరో ప్రాచీన యుగానికి తెలంగాణ నిలయమని సుమారు 26 లక్షల సంవత్సరాల కంటే ముందే తెలంగాణ మనుగడ సాగించిందని తేలింది.

Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

సూర్యుని నుంచి విడిపోయిన శకలం భూమిగా ఏర్పడిందని చెబుతారు. అది అత్యంత వేడిగా ఉండేదని దాన్ని ఉష్ణయుగంగా పిలుస్తారు. ఆ తర్వాత ట్రయాసిక్‌ యుగం లోనూ వేడి ఎక్కువగా ఉండేదని చెబుతారు.ఆ తర్వాత మంచుయుగం, రాతి యుగం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

ఇప్పటివరకు తెలంగాణ మంచు యుగం.. రాతి యుగం నాటి చరిత్రకు నిలయమన్న ఆనవాళ్లు ఎన్నో బయటపడగా తాజాగా మరో ప్రాచీన యుగానికి తెలంగాణ నిలయమని రుజువైంది. సుమారు 26 లక్షల సంవత్సరాల క్రితం అంటే మంచుయుగాని కంటే ముందే ట్రయాసిక్‌ యుగంలోని తొలి భాగం(జురాసిక్‌ యుగం-- 20-25 కోట్ల సంవత్సరాల క్రితం) లోనూ తెలంగాణ ఉందని తేలింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు లభ్యమయ్యాయి. పూర్వపు వరంగల్‌ జిల్లా ప్రస్తుత జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయలో ఉన్న అన్నారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానిక దక్షిణాన సుమారు కిలోమీటర్‌ దూరంలో 1980లో నాటి శాస్త్రవేత్తలు ఓ రాక్షసబల్లి(డైనోసార్‌) అవశేషాలను గుర్తించారు. నాటి నుంచి దానిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తాజాగా వివరాలు వెల్లడించారు. ఈ పరిశోధనల్లో ఆ రాక్షసబల్లి వయసు 22.9-23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు.

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

ఆ రాక్షసబల్లి అవశేషాలు ట్రయాసిక్‌ యుగంలో జీవించిన హరేరాసారియా వర్గానికి చెందినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాదు ఆ రాక్షసబల్లి అవశేషాలను బట్టి అది మాంసాహార డైనోసార్‌గా గుర్తించారు. దక్షిణ అమెరికాలో లభ్యమైన రాక్షసబల్లికి ప్రస్తుత రాక్షసబల్లికి పోలికలున్నాయని, రెండు ఒకేజాతికి చెందినవని శాస్త్రవేత్తలు తేల్చారు. కాగా ప్రాణహిత-గోదావరి లోయల్లోని మలేరీ ఘాట్ల వద్ద ఈ డైనోసార్‌ అవశేషాలు లభించాయి. దీన్ని తొలిసారి కనుగొన్న శాస్త్రవేత్త తారావత్‌ కుట్టీ కావడంతో ఆ ప్రాంతం పేరుతో పాటు శాస్త్రవేత్త పేరును కలిపి ఈ రాక్షసబల్లికి  ‘మలేరీరాప్టర్‌ కుట్టీ’ అని పేరు పెట్టారు. కాగా నాటి వాతావరణ పరిస్థితుల్లో రాక్షసబల్లులు ఏ విధంగా జీవనం సాగించాయి. వాటి అంతానికి కారణం ఏంటనే పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లభించిన డైనోసార్‌ అవశేషాలతో డైనోసార్ల మీద సాగుతున్న పరిశోధనలో కొంత పురోగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read:ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

Advertisment
తాజా కథనాలు