/rtv/media/media_files/2024/11/03/bMtSDU1rGkXuRGYq1UGN.jpg)
హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూసీ ప్రక్షాళనలో భాగంగా.. బాపూఘాట్‌ను పర్యాటక ప్రదేశంగా, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీని నిర్మించాలని సూచించారు. ఇక మొదటి దశ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ నుంచి ఎగువన ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ వరకు 21 కి.మీ మేర అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
Also Read: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి!
విగ్రహాల పోటీకి వ్యతిరేకం
అయితే హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుపై గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ స్పందించారు. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విగ్రహం ఏర్పాటు దిశగా రేవంత్ సర్కార్ ముందడుగులు వేస్తోంది. విగ్రహం డిజైన్‌లు, డిజైనర్లతో సంప్రదింపులు ప్రారంభించింది.
I am very much against this competition of Statues. My sincere appeal to Shri Revanth Reddy ji. @TelanganaCMO Please use the funds to establish health care and education initiatives in the state instead of a tall statue of Bapu🙏🏽 pic.twitter.com/JCKoXbjVq3
— Tushar GANDHI Manavta Meri Jaat. (@TusharG) November 2, 2024
అంతేకాదు గాంధీ విగ్రహం ఎత్తు, ఇతర అంశాలపై కూడా రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. విగ్రహాన్ని కూర్చొనే భంగిమాలో ప్రతిష్ఠించాలా, నడవడం లేదా కవాతు ఉండేలా విగ్రహం చేయించాలా అనేదానిపై అభిప్రాయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు, మేధావుల నిర్ణయం మేరకు విగ్రహం రూపకల్పన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read: జమిలీ ఎన్నికలపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన
ఇదిలాఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 72 అడుగులు. విదేశాల్లో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌లో 8 అడుగుల ఎత్తులో ఈ గాంధీ విగ్రహం ఉంటుంది. తెలంగాణలో అయితే అసెంబ్లీ ఆవరణలో 22 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ఉంది. 1999లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.