ఆ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు: భట్టి విక్రమార్క రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మాలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Dec 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మాలు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన యువ వికాసం సభలో ఆయన ప్రసంగించారు. ''రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు మూలన పడితే పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తాం. సింగరేణి, జెన్కో సంయుక్తంగా రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తాయి. Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్ ప్రారంభం: పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదు, మేం ధర్నాలు చేస్తాం అంటూ సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నాయకత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. వాళ్ల తప్పుడు ప్రచారంతో మేము చేసిన పనులు ప్రచారం చేయక తప్పడం లేదు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి పనులను 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప అభివృద్ధిగా చెప్పుకుంది. స్మశాన వాటిక ప్రారంభించి దండ వేసి, ధాన్యం కొనుగోలు కేంద్రం రిబ్బన్ కట్ చేసి ఇదే అభివృద్ధి అని పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ పాలించింది. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని సుమారు ఎనిమిది లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు. ఆ అప్పులకు మేము 11 నెలల కాలంలోనే 64 వేల కోట్లు బ్యాంకులకు వడ్డీలు కట్టాం. వడ్డీలు కట్టం అంటే కుదరదు. వచ్చే నిధులను ముందుగానే బ్యాంకులు కట్ చేసుకుంటాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నధాన్యం సాగు చేసిన వారికి క్వింటాకు 500 రూపాయల బోనస్, వేలాది ఉద్యోగాల కల్పన వంటి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే 56 వేల మందికి ఉద్యోగాలు అందించాం. చరిత్రలోనే ఇది ఒక రికార్డు. యువత సాంకేతికంగా బలంగా ఉండాలన్న లక్ష్యంతో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించాం. సింగరేణి కార్మికులకు ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు కోటి రూపాయల బీమాను అందుబాటులోకి తెచ్చాం. లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం కుంగిపోయాయి. కాళేశ్వరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసి ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని'' భట్టి విక్రమార్క అన్నారు. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! Also Read: తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే #tharmal power plants #telangana #telugu-news #batti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి