/rtv/media/media_files/2025/06/14/ehJ7zSJmOafo0UOa1DJa.jpg)
ప్రభుత్వం విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆలేరు ఎమ్మెల్యే వ్యక్తి గత పనులు చేసే గంధమల్ల రవి (38) ఆత్మహత్య చేస్తున్నాడు. బీర్ల ఐలయ్య సొంత ఇంట్లోని మూడో అంతస్తు టెర్రస్ పైన ఉరేసుకొని చనిపోయాడు. అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గందమల్ల రవికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : నీట్ ఫలితాలు విడుదల
Dead Body Found At MLA Beerla Ilayya House
Fake news Alert
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) June 14, 2025
సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి భార్య గంధమల్ల నవిత ..
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కి వరుసకు చెల్లలు..
గంధమల్ల నవిత పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం గంధమల్ల రవి అప్పుల బాధతో మధ్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.
అరేయ్ నితిన్ రెడ్డి, కొణతం దిలీప్… https://t.co/uk3HeQc2rN pic.twitter.com/ma4TjLlKid
Also Read : ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'సూపర్ హీరో' గా అల్లు అర్జున్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే!
Also Read : రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!
beerla-ilaiah | congress mla beerla ilaiah | mlc beerla ilaiah | paleru-constituency | latest-telugu-news