Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే
భూపాల్ పల్లిలో కవల పిల్లలు నిద్రలోనే మృతిచెందడం కలకలం సృష్టించింది. మర్రి అశోక్, లాస్యశ్రీ దంపతులకు రెండో సంతానంగా ఇద్దరు కవలలు పుట్టారు. అయితే శనివారం ఇద్దరికీ పాలు పట్టించి నిద్ర పుచ్చగా.. వారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. దీనికి కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.