Telangana Municipal Election 2026: కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా కుట్రపూరితంగా దోహదపడ్డాడో.. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి.. ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay vs Jeevan Reddy) కారకుడు అయ్యాడని మాజీమంత్రి జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy Issue) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలుస్తామనుకుంటే.. 20-22 స్థానాలకి పరిమితమైందన్నారు. ఇప్పటికైనా మాకు స్వేచ్ఛ ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి వేడుకుంటున్నానని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జండా మోసిన కార్యకర్తలకే చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని, అవకాశ వాదులకు ఇవ్వొద్దని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.
Also Read : కొత్తగూడెం మేయర్ స్థానం మాదే.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
Congress Party's Downfall In Jagityal
Also Read : 11 మున్సిపాలిటీల్లో హంగ్.. ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ నుంచి స్వేచ్ఛను ప్రసాదించాలని జీవన్ రెడ్డి(Congress MLC Jeevan Reddy Sensational Comments) చేతులు జోడించి కోరడం ఆసక్తికరంగా మారింది. రాయికల్ మున్సిపల్ లో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులు 8 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్కటి గెలిచారని, మేము మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండు గెలుచుకున్నామని వివరించారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాల మూలంగా బీ ఫామ్ పంపిణీ లో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా నేడు స్వతంత్రుల పై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని స్పష్టం చేశారు.
టికెట్లు రాని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ప్రచారం చేయాల్సి వచ్చిందని, పార్టీ సూచించిన అభ్యర్థులకు ప్రచారం చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను ఓడించడానికి ఎమ్మెల్యే సంజయ్ ప్రచారం చేశారని ఆరోపించారు. నేడు గెలిచిన అభ్యర్థులను లోబర్చుకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి విప్ నకు అనుగుణంగా ఓటు వేస్తామని చెబుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. స్వతంత్రులకు నేను తోడుగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీని వదిలే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Jeevan Reddy : ఎమ్మెల్యే సంజయ్ వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా దోహదపడ్డాడో..జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి..ఎమ్మెల్యే సంజయ్ కారకుడు అయ్యాడని మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలుస్తామనుకుంటే.. 20-22 స్థానాలకి పరిమితమైందన్నారు.
Former Minister Jeevan Reddy's sensational comments