/rtv/media/media_files/2026/02/13/aliabad-municipality-2026-02-13-15-44-57.jpg)
Municipal elections
Municipal elections : తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈనెల 11వ తేదీన ఆ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఆయా చోట్ల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటికే అత్యధిక స్థానాలు ఆపార్టీ కైవసం చేసుకుంది. అయితే, పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు. ఈ 11 మున్సిపాలిటీలు ఎవరికీ దక్కిన ఆ పార్టీ ఖాతాలో మరికొన్ని మున్సిపాలిటీలు చేరనున్నాయి.
కాగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల వివరాలు
అలంపూర్ మున్సిపాలిటీ
పరకాల మున్సిపాలిటీ
సంగారెడ్డి: జిన్నారం మున్సిపాలిటీ
నర్సాపూర్ మున్సిపాలిటీ
కేసముద్రం మున్సిపాలిటీ
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ
ఇస్నాపూర్ మున్సిపాలిటీ
జమ్మికుంట మున్సిపాలిటీ
కామారెడ్డి మున్సిపాలిటీ
జనగామ మున్సిపాలిటీ
అమరచింత మున్సిపాలిటీ
Follow Us