పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పేర్కొన్నారు. సంగారెడ్డిలో (Sangareddy) శనివారం రాత్రి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన భార్య నిర్మలారెడ్డికి (Nirmala Jagga Reddy) లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో చర్చిస్తామన్నారు.
Also Read: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!
ప్రజల్లోనే ఉంటా
ఎమ్మెల్సీగా తోపాజి అనంతకిషన్‌కు ఛాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నస్తానన్నారు. ఇందుకోసం అధిష్ఠానాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. తన వద్ద ఉన్న డబ్బులను పండుగలు ఘనంగా నిర్వహించేందుకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడ ఇష్టం లేదని తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ రూ.2 వేల చొప్పున పంచి తనను ఓడించినట్లు ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటానని.. ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Also Read: ఈ నెల 18న కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్.. ఎందుకంటే ?
నేను పైటర్‌ని
అలాగే ఓటమి అందరికీ అనేక పాఠాలను నేర్పిస్తుందని.. తాను ఓడిపోయినా కూడా తన భార్య నిర్మలకు కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ పిలిచి తన భార్యకు ఈ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ఇకనుంచి ఏ పండుగ వచ్చినా కూడా సంగారెడ్డిలో కార్యక్రమాలు జరిపిస్తానని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బలహీనుడు కాదని.. జగ్గరెడ్డి అంటే ఓ ఫైటర్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందన్నారు జగ్గారెడ్డి. తాను ఓడిపోయినా.. తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి.. తన భార్య నిర్మలకు పదవిచ్చారన్నారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేపిస్తానని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని పేర్కొన్నారు. 1995లోనే తాను పోలీసులతో గొడవపెట్టుకున్నట్లు గుర్తుచేశారు.
Also Read: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష
ఏమైనా వ్యూహం ఉందా ?
ఇదిలాఉండగా మొన్నటివరకు జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవారు. గతంలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని కూడా అన్నారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయనని బాంబు పేల్చడంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎదైనా వ్యూహం ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
Also Read: Sai Baba కి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా..