/rtv/media/media_files/N5w15yxL6UGsWgMtknEc.jpg)
మానవహక్కుల ఉద్యమకారుడు సాయి బాబా అక్టోబర్ 11న కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని నిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. ప్రముఖ రచయితగా, విద్యావేత్తగా సాయి బాబా ఎంతో గుర్తింపు పొందారు.
Also Read : మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్
9 ఏళ్ల పాటు జైల్లో
అయితే అలాంటి పేరు ప్రఖ్యాతలు పొందిన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2017లో సాయి బాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీని కారణంగా ఆయన దాదాపు 9 ఏళ్ల పాటు నాగ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించారు.
Also Read : ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్
నిర్ధోషిగా బయటకు
ఇక సుప్రీకోర్టు ఆదేశాలతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయి బాబాను నిర్ధోషిగా వెల్లడించింది. దీంతో ఆయన ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే పది రోజుల క్రితం ఈ ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయి బాబా అనారోగ్యం పాలవడంతో నిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. అయితే సాయిబాబా కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.
Also Read : యాంకర్ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే
గాంధీ మెడికల్ కాలేజీలో అప్పగింత
ఇవాళ ఆయన పార్థివదేహాన్ని మౌలాలి కమాన్ దగ్గర ఆయన నివాస స్థలమైన శ్రీనివాసా హైట్స్‌కు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 కి చివరి ఊరేగింపుగా బయలుదేరి సాయంత్రం 4 గంటల కల్లా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో సాయి బాబా పార్థివదేహాన్ని అప్పగించనున్నారు.
ప్రముఖులు నివాళులు
అందువల్ల సాయిబాబా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. శ్రీనివాసా హైట్స్ వద్ద కోదండ రామ్, విరసం, అల్లం నారాయణ, ప్రోఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాలు, ఢిల్లీ నుంచి విద్యార్థి సంఘాలు సహా ఇతర ప్రముఖులు భారీగా తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..