TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!

నిజామాబాద్‌ జిల్లాలో లావణ్య అనే ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని అధికారులు తెలిపారు.

TELANGANA LOGO
New Update

నిజామాబాద్‌:

డీఎస్సీ -2024 లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని ఏడుగురిని ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ప్రధానోపాధ్యాయుల పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Also Read:  UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..!

ఈ క్రమంలో శనివారం నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. ఎస్జీటీ తెలుగు మాధ్యమంలో 257 వ ర్యాంకు అభ్యర్థి ఉట్నూర్‌ లావణ్యకు నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు.

Also Read: పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం

గత నెల 16న బాధ్యతలు చేపట్టిన ఆమె శనివారం వరకు కూడా విధులకు హాజరయ్యారు. కాగా సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 125 వ ర్యాంకు అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని,దీనిని సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని అధికారులు తెలిపారు.

Also Read: ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్‌ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!

దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ రోదిసత్ఊ ఓ ఆడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తనకు జరిగిన అన్యాయం పై సోమవారం ఉన్నతాధికారులను కలిసి చెప్పనున్నట్లు  పేర్కొన్నారు. 

ఈ విషయం పై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు స్పందిస్తూ...విచారణ చేయిస్తానని తెలిపారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి ప్లేస్ లో అర్హులైన మరో ఏడుగురికి కొత్తగా నియామక పత్రాలు అందించారు  డీఎస్సీ నియామకాల్లో ఇలా జరగడం రాష్ట్రంలోనే ఇది అరుదైన సంఘటన అని, అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. 

Also Read: Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్‌ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు

డీఎస్సీ 2024 ఫలితాలు వెలువడిన తరువాత 1: 3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారి ధ్రువ ప్రతాలను పరిశీలించారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్థులకు సంబంధించి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హిందీ పండిట్‌ అభ్యర్థులకు అర్హత లేకపోయినా ఎంపిక చేస్తున్నారన్న విషయాన్ని అధికారి దృష్టికి తీసుకుని వెళ్లారు. సంబంధిత అధికారి మాత్రం అన్ని అర్హత ప్రకారమే ఉన్నాయని క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.

అనంతరం అధికారులు వారిని ఎంపిక చేసి పోస్టింగులు ఇచ్చారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు లాంగ్వేజీ పండిట్లు , ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లను హిందీ సబ్జెక్టులో ఎంపిక చేసి నియామక పత్రాలు ఇచ్చారు.ఇదిలా ఉంటే వీరి నియామకాన్ని సవాలు చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు ఖమ్మం జిల్లా కలెక్టరుకు , డీఈవోకు ఫిర్యాదు చేశారు. డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని, నోటిఫికేషన్‌ లో పేర్కొన్న అర్హతలు లేవని ఫిర్యాదులో చెప్పారు. దీన్ని సీరియస్‌ గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల ప్రకారం అనర్హులపై చర్యలు తీసుకున్నామని డీఈవో తెలిపారు.తొలగింపునకు గురైన ఏడుగురు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో గురువారం ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకుని , కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తరువాత అర్హత లేదనే సాకుతో తమను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డీఈవోను కలిసి విజ్ఙప్తి చేశారు. 

#telangana #nizamabad #dsc #teacher-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe