/rtv/media/media_files/2024/12/18/91zBgZWhMNCwrwSo6S0F.jpg)
Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన అశ్విన్ డ్రెసింగ్ రూమ్‌లో మాట్లాడిన ఎమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగియగానే అనౌన్స్ చేసిన స్పిన్ మాంత్రికుడు.. గురువారం సాయంత్రం భారత్‌కు తిరిగి రానున్నాడు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసిన లెజెండ్ స్పిన్నర్.. ఉద్వేగభరిత ప్రసంగం చేయగా బీసీసీఐ నెట్టింట పోస్ట్ చేసింది.
చాలా సంతోషంగా ఉన్నా..
ఈ మేరకు అశ్విన్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇది నిజంగా ఎమోషనల్ మూమెంట్. రోహిత్, విరాట్, గౌతీ భాయ్‌కి థాంక్స్. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో పర్యటించినట్లు అనిపిస్తోంది. కెరీర్ మొదట్లో దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆటను ఆస్వాదించాను. రాహుల్ పాజీ, సచిన్ పాజీ.. ఇలా ఒక్కొక్కరు రిటైర్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ వీడ్కోలు పలికే టైమ్ వస్తుంది. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చింది. నాది గ్రేట్ జర్నీ. సహచర ఆటగాళ్లతో గొప్ప సంబంధాలు ఏర్పరచుకున్నా. గత 4-5 ఏళ్లలో కోహ్లీ, రోహిత్, జడేజా వంటి ఆటగాళ్లతో గొప్ప అనుబంధం ఏర్పడింది. నేను తిరిగి ఇంటికి వెళ్తాను. మెల్‌బోర్న్‌లో ఎలా ఆడుతున్నారో టీవీలో చూస్తా. ఆటపై అభిమానం ఇలాగే ఉంటుంది. మీ అందరికీ ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటా. ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇక అశ్విన్ దగ్గరకు వచ్చిన ఆసీస్ ప్లేయర్స్.. కమిన్స్, లయన్ అశ్విన్ ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. అనంతరం వారు సంతకాలు చేసిన జెర్సీని అందించారు.
End of an Era! 💔
— OneCricket (@OneCricketApp) December 18, 2024
Ashwin waves goodbye to Indian cricket 🥹#AUSvIND#Ashwinpic.twitter.com/ex3vG2j5yh
Follow Us