Hyderabad Book Fair: హైదరాబాద్‌లో పుస్తకాల పండుగొచ్చింది
హైదరాబాద్‌లో పుస్తకాల పండగ ప్రారంభమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనలో.. తొలిరోజు మధ్యాహ్నం నుంచే పాఠకుల సందడి మొదలైంది. ఈ నెల 19 వరకు ప్రదర్శన కొనసాగనుండగా.. ఈ దఫా మొత్తం 362 స్టాళ్లు ఏర్పాటు చేశారు.