జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గరికొస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. '' రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. అందరికీ అవకాశాలు అన్నిసార్లు రాకపోవచ్చు. కానీ అవకాశం మాత్రం వస్తే మన కోసం కష్టపడే వారినే గెలిపించుకోవాలి. ఇలా చేయకుంటే చారిత్రక తప్పిదమే అవుతుంది.
Also read: బిగ్ షాక్.. ఆ వీడియోలు చేస్తే రూ.12 లక్షలు ఫైన్!
బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ పేరుతో ఆశీర్వదించాలని ముందుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే, దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్ధన్ రెడ్డి అకాల మరణం చెందితే ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఆనాడు పీజేఆర్ గౌరవార్థం చంద్రబాబు నాయుడు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టారు. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సహకరించారు. కానీ పీజేఆర్ కుటుంబంపై మాత్రం బీఆర్‌ఎస్ పోటీగా అభ్యర్థిని నిలబెట్టి దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the rally and corner meeting at Yellareddyguda. https://t.co/Knnz123h4f
— Revanth Reddy (@revanth_anumula) October 31, 2025
ఈ ఉపఎన్నిక అభివృద్ధికి, సెంటిమెంట్‌కు మధ్య జరుగుతోంది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్‌ను గెలిపిస్తే.. కొద్ది నెలల్లోనే రూ.4 వేల కోట్ల నిధులను మంజూరు చేయించారు. 3-0-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మేడ్చల్, షామీర్‌పేట ఎలివేటర్ కారిడార్ పనులను, తాగునీటి, డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాడు. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకోవాలని'' సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
Also Read: రూ.8 కోట్ల FDలు, 1.1 కిలోల బంగారం.. కాబోయే CJI ఆస్తుల వివరాలివే
Follow Us