CM Revanth Reddy: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
కలెక్టర్ కీలక ఆదేశాలు...
దిలావర్‌పూర్ గ్రామస్థులతో కలెక్టర్ అభినవ్ చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు కలెక్టర్ తెలిపారు. ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఆందోళనను కాస్త తగ్గించారు. కాగా ఏ క్షణమైన ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
పోలీసులపై రాళ్ల దాడి..!
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మొత్తం నాలుగు గ్రామాల ప్రజలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆందోళనలను ఉదృతం చేశారు. కాగా నిన్నమధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని రైతులను కోరగా.. ఆమెను దాదాపు ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.