Maharashtra CM: మహా కింగ్... 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం!

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. కాగా కొత్త సీఎం ఎవరు అవుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. సీఎం కుర్చీ కోసం ఫడ్నవీస్, షిండే మధ్య పోటీ నడుస్తోంది. కాగా ఈ నెల 26న మహాకు కొత్త సీఎంతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం.

New Update
MAHA CM

Maharastra New CM: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి విజయభేరి మోగించింది. 224 స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మధ్యాహ్నం 3గంటలకు మహాయుతి కూటమి నేతల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయోత్సవంలో పాల్గొననున్నారు ఫడ్నవీస్. సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. మహారాష్ట్ర విజయంపై ప్రజలను ఉద్ధేశించి మోదీ ప్రసంగించనున్నారు. కాగా ఇప్పటికే అధికారం ఎన్డీయే కూటమికి ఖాయం కాగా మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ALSO READ: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

మహా కింగ్ ఎవరు?...

మహారాష్ట్ర కొత్త సీఎంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు షిండే నే మరోసారి సీఎం అవుతారని చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఫడ్నవీస్ సీఎం అవనున్నారని బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇదే అంశం తుది నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీయే కూటమి నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ నెల 25న శాసనసభా పక్ష నేత ఎన్నిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 26న మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రోజు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ: వైసీపీకి భారీ షాక్.. 11మంది రాజీనామా!

ఫడ్నవీస్ Vs షిండే....

ఫడ్నవీస్, షిండే వర్గాల మధ్య పోటాపోటీ నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగమైన సరే బీజేపీకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి.. ఫడ్నవీస్ సీఎం కావాలని మహారాష్ట్ర బీజేపీ మద్దతుదారులు అంటున్న మాట. మరోవైపు షిండే లేకపోతే బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కావని.. షిండే వల్లే మహారాష్ట్రలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని షిండే వర్గీయులు ఖరాకండిగా చెబుతున్నారు. మరోవైపు తాను కూడా సీఎం  రేసులో ఉన్నానని అజిత్ పవార్ అంటున్నారు. ఇదిలా ఉంటే మీడియా ముందు షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం కావాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు ఒక్కడే నాయకుడు ఉండాలంటూ షడ్నవీస్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. కాగా మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారనేది వేచి చూడాలి.

ALSO READ:  మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..

ALSO READ: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు