/rtv/media/media_files/2025/07/25/cm-revanth-2025-07-25-09-07-34.jpg)
CM Revanth
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సెక్రటేరియట్ బిల్డింగ్‌లో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే రోడ్డుపైనే ఇవి పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కూడా సెక్రటేరియట్ బిల్డింగ్‌లోని 5వ ఫ్లోర్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం కట్టినప్పటినుంచి వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒకవేళ పెచ్చులు ఊడిన సమయంలో ఆయన అక్కడ ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టిన మోదీ..అత్యంత ఎక్కువ టైమ్ ప్రధానిగా..
సచివాలయంలో మరో ప్రమాదం
— The Bharat (@TheBharat_News) July 25, 2025
తెలంగాణ సచివాలయంలో మరో ప్రమాదం జరిగింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెక్రటేరియట్లో పెచ్చులు ఊడిపడ్డాయి.
సీఎం కాన్వాయ్ దారిలోనే ఈ ఘటన జరగడంతో సిబ్బంది ఆందోళన చెందారు.
అయితే, అందరూ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఇది జరగడంతో ఊపిరి… pic.twitter.com/1gIqeVwhcn
సచివాలయ నిర్మాణం నాణ్యతలో లోపాలున్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వర్షాలు పడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని అధికారులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.