Telangana : హైదరాబాద్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్
డీఎస్సీ వాయిదా కోరుతూ సోమవారం సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ రూటు మార్చిన విద్యార్థి సంఘాల సభ్యులు బీఆర్కే భవన్ వైపు వెళ్లారు. ఈరోజు అక్కడ కాళేశ్వరంపై ఐఏఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే అభ్యర్థులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది.