CM Revanth: సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేపై సీరియస్

సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు. సభలో విపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని.. ఈ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.  

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

''కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇది రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశం. ఇది అత్యంత కీలకమైనది. గత 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమలపై పూర్తిగా చర్చించడం కోసం ఈ సమావేశాల్లో ఛాన్స్ ఉంటుంది. సభ్యులందరూ కూడా కచ్చితంగా రావాలి. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలి.

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

అందరూ వివిధ అంశాల వారీగా ప్రిపేర్ అయ్యి సభకు రావాలి. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్‌లు పర్యవేక్షించాలి. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారు. హాజరైతే సభలో ఏం జరుగుతుందో తెలుస్తుందని'' సీఎం రేవంత్ అన్నారు. అలాగే సీఎల్పీ భేటీలో మాట్లాడుతుండగా.. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జైవీర్‌ బయటికి వెళ్లారు. దీంతో ఆయనపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్‌ హైజాక్‌కు భారత్‌ సాయం చేసిందని ఆరోపణలు

Also Read: అమ్మకానికి కన్యత్వం.. నెట్టింట 22ఏళ్ల విద్యార్థిని రచ్చ.. కోట్లు గుమ్మరించిన హాలీవుడ్ హీరో!

Advertisment
తాజా కథనాలు