CM Revanth Reddy : మావోయిస్టులకు సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన పిలుపు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన  నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

New Update
cm revanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన  నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.  కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా, ఇంటి స్థలం మంజూరు,కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని తెలిపారు.  వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్ తెలిపారు.

 దేశం కోసం ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారని వారి సేవలు మరువలేమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదన్నారు.  గోషామహల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి.. తొలి ప్రతిని డీజీపీ శివధర్‌కు అందించారు.

పోలీసు శాఖ ప్రథమ స్థానంలో

అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ..  దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది.. రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మా లక్ష్యం.. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి.. జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు నేతలకు పిలుపునిస్తున్నాం. . పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. డ్రగ్స్‌ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్‌ పేరుతో బృందాలను నియమించామని తెలిపారు. 

Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?

Advertisment
తాజా కథనాలు