మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి వివాహవేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. శంషాబాద్ జీఎమ్మార్ ఎరీనా కన్వేషన్ హాల్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహాం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. మనవరాలి వివాహం నేపథ్యంలో మల్లారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఆయన కలిసి వివాహానికి రావాలని కోరారు.
Also Read : ఇప్పుడే కూల్చివేతలు వద్దు.. అలా చేద్దాం: మూసీపై రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
Also Read : ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? పండితులు చెబుతున్న డేట్ ఇదే!
చర్చనీయాంశమైన రేవంత్ రాక..
అయితే.. గత రాజకీయ విభేదాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్లారెడ్డి కాలేజీలకు నోటీసులు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలో కూల్చివేతల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరు అవుతారా? కారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మల్లారెడ్డి ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరవడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.
Also Read : మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!
గత కొన్ని రోజులుగా కాంగ్రెస పార్టీకి దగ్గర కావాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?