/rtv/media/media_files/2024/10/27/2HSH0d5mc6VyJxMj6YAW.jpg)
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు రీసెంట్ గా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న 'హే జవానీతో ఇష్క్ హోనా హై' మూవీలో సెకెండ్ ఫిమేల్ లీడ్ గా శ్రీలీలను తీసుకున్నారని, త్వరలోనే ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నారని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోగా.. ఆమె ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చి చేరినట్లు బీ టౌన్ నుంచి లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది.
Also Read : వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్‌కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని.. దాంతో మూవీ టీమ్ ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారట.
Also Read : యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ
Sreeleela replaced Pooja Hegde in Guntur Kaaram
— ®|$#! (@SkyStar04510789) October 26, 2024
Pooja Hegde replaced Sreeleela in Varun Dhawan's next https://t.co/eILeFNepY1pic.twitter.com/YQfdJvUh0M
Also Read : Amaran కోసం సాయి పల్లవి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా?
బాలీవుడ్ ఎంట్రీ జస్ట్ మిస్..
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల కనుక ఈ మూవీలో నటించి ఉంటే ఇదే ఆమెకు బాలీవుడ్ ఎంట్రీ మూవీ అయ్యి ఉండేది. ఇక పూజా హేగ్డ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలోనే వరుస సినిమాలు చేస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన 'దేవా' షూటింగ్ పూర్తి చేసింది. ఈ మూవీతో పాటూ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. అలాగే రీసెంట్ గా కోలీవుడ్ లో #Thalapathy69, #Suriya44 మూవీస్ లోదళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్ తో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
Also Read : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ.. ఏం చెప్పిందంటే?