హైదరాబాద్ లో 100 అడుగుల NTR విగ్రహం.. స్థలం కేటాయించిన సీఎం రేవంత్!

హైదరాబాద్‌లో 100అడుగుల NTR విగ్రహానికి, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఔటర్‌ రింగ్‌‌‌రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్టాపనకు ప్రభుత్వపరంగా స్థలం కేటాయిస్తామన్నారు. నందమూరి మోహనకృష్ణ,లిటరేచర్‌ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

New Update
cm revanth reddy

cm revanth reddy Photograph: (cm revanth reddy)

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ భారీ విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్టాపనకు ప్రభుత్వ పరంగా స్థలం కేటాయిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం కూడా భారీగా స్థలం కేటాయిస్తామన్నారు.

ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్టీఆర్ కుమారుడు

ఈ మేరకు నందమూరి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదన రాజు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రేవంత్‌ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను రేవంత్‌ రెడ్డికి వివరించారు. 

ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వారు రేవంత్ రెడ్డికి వివరించారు. దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని.. అలాగే ఓ పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలనుకొంటున్నామని సీఎంకు తెలిపారు. అయితే ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

హైదరాబాద్‌లో ప్రత్యేకించి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు, అలాగే ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి రేవంత్‌ రెడ్డి అంగీకరించారు. సీఎం అంగీకారంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ సంతోషిస్తారని.. ఆయనకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరఫున ధన్యవాదాలను తెలియచేస్తున్నామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు