Big breaking : కేసీఆర్‌ కుటుంబంపై సీబీఐ విచారణ...పీసీసీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

హెచ్‌సీయూ భూముల వివాదంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండి పడ్డారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోజరిగిన భూదోపిడి మీద చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

New Update
PCC Chief Mahesh Kumar Goud Challenge To KTR

PCC Chief Mahesh Kumar Goud Challenge To KTR

Big breaking :హెచ్‌సీయూ భూముల వివాదంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండి పడ్డారు. ఈ మేరకు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోజరిగిన భూదోపిడి మీద చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దమ్ముధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాలు విసిరారు.కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Also Read :  తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

హైదరాబాద్‌లో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు.  కరెప్షన్ కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమని, లిక్కర్ స్కాం చేసింది కేసీఆర్ కుటుంబమని ఆయన ఆరోపించారు. కేటీఆర్‌ దిగజారి మారుతున్నారని, అడ్డమైన వాళ్లు వచ్చి మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు నమ్మద్దు అంటూ ఆయన పిలుపునిచ్చారు.
 

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ధనం దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబమేనన్నారు మహేశ్‌ కుమార్‌. కేసీఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో హైదరాబాద్ భూములను మాయాజాలం చేసి ఎకరా రూ.100 కోట్లకు అమ్ముకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 10 వేలకుపై చిలుకు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్..హెచ్‌సీయూ భూములతో పాటు పలు యూనివర్సీటీలకు చెందని భూములను కూడా దోచుకోవాలని చూశారని ఆరోపించారు.ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా అప్పటి మంత్రి కేటీఆర్ మాట్లాడుకున్నారని తెలిపారు.

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

కేటీఆర్‌కు రావాల్సిన ముడుపులు రూ.5,200 కోట్లను కాంగ్రెస్‌కు అంటగడ్డే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రూ.5,200 కోట్లు తీసుకుని హెచ్‌సీయూ భూములను బిల్లీరావుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించేదని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివని, ఇందుకు బదులుగా 390 ఎకరాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హెచ్‌సీయూ భూములను కాపాడింది రాజశేఖర్ రెడ్డి అని, వెనక్కి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.  బీఆర్ఎస్ దోపిడీని భరించలేకనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Also Read :  'బెంగళూరులో బతకడం కష్టమే'

 కేటీఆర్ గుంటూరులో ఏం చదువు నేర్చుకున్నాడో ..సగం సగం తెలుసుకొని రాజకీయలబ్ది కోసం కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీసీ కుల గణన వల్ల బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టిందన్న ఆయన రైతులు బాగు పడుతుంటే కేటీఆర్ కి కడుపు నొప్పి వస్తోందన్నారు.AI టెక్నాలజీతో వీడియోలు చేయించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపారని పీసీసీ చీఫ్‌ ఆరోపించారు.

Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు