Shocking News: 'బెంగళూరులో బతకడం కష్టమే'

జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. బెంగళూరులో ఖర్చులపై ఓ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Bengaluru

Bengaluru


జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో చూసుకుంటే మనిషి బతికేందుకు నెలకు కనీసం రూ.5 వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇక హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఇంటి రెంట్ నుంచి, సరకుల వరకు అన్ని ధరలు కూడా పెరిగిపోయాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

అయితే లింక్డ్‌ ఇన్‌లో హరీశ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేసిన పోస్ట్‌ చూస్తే బెంగళూరులో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. '' రోజురోజుకి బెంగళూరులో ఖర్చులు పెరిగిపోతున్నాయి. మీకు అలాగే అనిపిస్తోంది కదా. పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. దీనివల్ల మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. మార్చి 7న నందిని పాల ధర లీటర్‌కి రూ.4 పెరిగింది. దీనివల్ల లీటర్ పాల ధర రూ.47కి చేరింది. 1050 ml ఉండాల్సిన పరిణామం కూడా 1000 mlకి పడిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగాయి. 

ప్రజా రవాణా, కరెంట్ బిల్లు, గార్బేజ్ ట్యాక్స్, కాఫీ పౌడర్ ఇలా ప్రతీదాని ధరలు పెరిగిపోయాయి. ఇప్పటిదాకా మెట్రో గరిష్ఠ ధర రూ.60 ఉంటే ఇప్పుడు రూ.90కి పెరిగింది. వైట్‌ఫీల్డ్, కోరమంగళ లాంటి ప్రాంతాల్లో ఒక కుటుంబం ఉండాలంటే కనీసం రూ.40 వేలు ఖర్చవుతుంది. గతేడాది ఈ ఫ్యామికి సగటు ఖర్చు రూ.25 వేలు ఉండేది. పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతం వల్ల మధ్యతరగతి మనిషి నలిగిపోతున్నాడని'' హరీశ్ రాసుకొచ్చారు.       

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

హరీశ్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇంటి మెయింటెనెన్స్‌ కోసమే కేవలం రూ.11 వేలు ఖర్చవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పని మనిషికి కూడా కనీసం రూ.11 వేలు ఇవ్వాల్సి వస్తోందని మనో నెటిజన్ చెప్పుకొచ్చారు. జీవన వ్యయం విషయంలో ముంబైని బెంగళూరు మించిపోయేలా ఉందని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. 

 rtv-news | bengaluru | national-news

#national-news #bengaluru #rtv-news #telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు