Car on fire : కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన ఆయన వెంటనే బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది.