బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రూ.8,888 కోట్ల విలువైన టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రి అపాయిట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. అపాయిట్మెంట్ లభించడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!
కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారం..
కేటీఆర్ పురపాలక మంత్రి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరిగాయన్న అంశంపై తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగింది. ఇందులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ ను అనుమతి కోరింది తెలంగాణ సర్కార్. గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత కేటీఆర్ ను విచారించేందుకు సిద్ధం అవుతోంది ఏసీబీ. అనంతరం ఆయపై ఎఫ్ఐఆర్ ను సైతం నమోదు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ?
మరో వైపు కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి ఈ అంశంపై నిత్యం లీకులు ఇస్తూ వస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బాంబులు పేలబోతున్నాయంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ సైతం తాను సిద్ధమంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అరెస్ట్ అయితే రెండు నెలలు జైలులో ఉండి ట్రిమ్ అవుతానని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
కేంద్రం ఎలా స్పందిస్తుంది?
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ను టార్గెట్ చేసేందుకు ఈ రోజు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అమృత్ టెండర్లలో అవకతకవలపై ఆధారాలను ఆయన కేంద్ర మంత్రికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో కేంద్ర మంత్రి ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.