KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫున ఆయన లీగల్ టీం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
KTR3

KTR

KTR: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లీగల్ టీమ్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో.. అరెస్ట్ నుంచి అయినా రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగింది.

ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు కూడా వినాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ కూడా ఈ కేసులో స్పీడ్ పెంచింది. కేటీఆర్ కు నోటీసులు పంపించింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 
ఇది కూడా చదవండి: కేటీఆర్ కు ఒకే రోజు మూడు షాకులు.. యాక్షన్ మొదలు పెట్టిన ఈడీ!

Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ

ఈ వారంలోనే KTR అరెస్ట్..

కేటీఆర్ అరెస్ట్ ఒకటి రెండు రోజుల్లోనే ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు అడ్డురాకుండా ఏసీబీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ (MAUD), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ-ఫార్ములా రేసు వ్యవహారంపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు