బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఒకే రోజు మూడు బిగ్ షాక్ లు తగిలాయి. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే.. కొద్ది సేపటి క్రితం ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని తెలిపింది. మరో వైపు హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదన కూడా వినాలని కోరింది.