Oscar 2025 : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్

97వ ఆస్కార్‌ బరిలో సౌత్‌ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. వీటిలో సూర్య నటించిన 'కంగువా' ఆస్కార్ రేసులో నిలవడం గమనార్హం.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది.అలాంటి సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

New Update
kanguva nominated for oscar 2025

kanguva movie

ప్రపంచవ్యాప్తంగా సినీ నటులు, దర్శకులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కలగంటారు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు 97వ ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి పలు దక్షిణాది సినిమాలు పోటీలో నిలవనున్నాయి.

వీటిలో సూర్య నటించిన 'కంగువా' ఆస్కార్ రేసులో నిలవడం గమనార్హం. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' కూడా ఆస్కార్ బరిలోకి ప్రవేశించింది. ఆస్కార్ 2025 కోసం భారతదేశం నుంచి షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాల్లో ఆడు జీవితం, కంగువా, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్, ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం) చిత్రాలు ఉన్నాయి. 

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

ఈ చిత్రాల్లో నుంచి ఫైనల్ నామినేషన్లను జనవరి 8 నుంచి 12 మధ్య ఎంపిక చేస్తారు. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్‌ చేస్తారు. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో 'కంగువా', 'ఆడు జీవితం' (ది గోట్ లైఫ్) ఆస్కార్ రేసులో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ముఖ్యంగా సూర్య నటించిన 'కంగువా' బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 

ఈ మూవీ రూ. 2000 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని మూవీ టీమ్ రిలీజ్ కు ముందు ప్రచారం చేసినా.. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.ఈ నేపథ్యంలో, ఆస్కార్ రేసులో ఇలా ఫలితాలు సాధించలేని సినిమాలు ఎలా ఎంపికయ్యాయన్నది నెటిజన్లకు సందేహం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. 'అట్టర్ ప్లాప్ సినిమాకి ఆస్కార్ ఏంట్రా బాబూ' అంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Also Read: Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?

Advertisment
తాజా కథనాలు