/rtv/media/media_files/2025/09/02/kavita-2025-09-02-15-59-40.jpg)
Kavita
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని పార్టీ శ్రేణులు తగలబెట్టారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేశారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేశారు. తమ పార్టీ నేతలను కించపరిచేలా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు
— RTV (@RTVnewsnetwork) September 2, 2025
హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన
హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు#Telangana#BRSParty#KavithaKalvakuntla#brsleader#RTVpic.twitter.com/JeCrdabb32
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తీసేస్తున్న పార్టీ శ్రేణులు pic.twitter.com/2MmIdFpmp0
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2025